: బీహార్ సీఎం జితన్ రాం మాంఝీపై బహిష్కరణ వేటు
బీహార్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి, పార్టీ నేత జితన్ రాం మాంఝీపై జేడీ(యూ) వేటు వేసింది. పార్టీ నుంచి ఆయనను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగీ వెల్లడించారు. సీఎం పదవికి రాజీనామా చేయాలన్న పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మాంఝీ, తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు, పార్టీ చర్యలపై మాంఝీ మద్దతుదారులు హైకోర్టును ఆశ్రయించే అవకాశమున్నట్టు సమాచారం.