: ప్లీజ్... 8 నెలల గడువివ్వండి: జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టును కోరనున్న కేసీఆర్ సర్కారు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలను మరో ఎనిమిది నెలలు ఆలస్యం చేసే దిశగా కేసీఆర్ సర్కారు పావులు కదుపుతోంది. నిన్నటిదాకా జీహెచ్ఎంసీ ఎన్నికలపై నోరు మెదపని ప్రభుత్వం, మొన్న హైకోర్టు మొట్టికాయలతో ఎట్టకేలకు నోరు విప్పింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసిన కోర్టు, ఈ విషయంపై మరికొద్దిసేపట్లో విచారణ చేపట్టనుంది. ఈ విచారణకు హాజరుకానున్న తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ద్వారా ప్రభుత్వం తన విజ్ఞప్తిని కోర్టుకు విన్నవించనుంది. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారుకు ఎంతలేదన్నా ఎనిమిది నెలల సమయం పట్టనుందని ప్రభుత్వం తన వాదనను వినిపించనుంది. మరి ప్రభుత్వ వాదనపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.