: నల్లధనం కేసుల్లో చట్ట ప్రకారం చర్యలు: అరుణ్ జైట్లీ
నల్లధనం కేసుల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇప్పటివరకు 350 మంది ఖాతాల మదింపు పూర్తి చేశామని తెలిపారు. మిగతా ఖాతాల మదింపును మార్చి 31 లోగా పూర్తి చేస్తామని మీడియాతో చెప్పారు. 60 మంది ఖాతాదారులపై అభియోగాలు నమోదుచేసి, విచారణ ప్రారంభించామన్నారు. స్విస్ బ్యాంక్ అధికారులతో మాట్లాడేందుకు అక్టోబర్ లోనే కేంద్ర బృందాన్ని పంపామని పేర్కొన్నారు. నల్లధనంపై ఆరేడు నెలలుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని, ఇవాళ వెల్లడైన జాబితాలో ఎక్కువమంది పేర్లు ప్రభుత్వానికి తెలిసినవేనని పేర్కొన్నారు. అయితే, జాబితాలో వెల్లడైన కొత్త పేర్లను అధికారులు పరిశీలిస్తున్నారని జైట్లీ తెలిపారు.