: ‘ఎగ్జిట్’ కాదు... ‘ఎగ్జాక్ట్’ ఫలితాలు మాకే అనుకూలం: వెంకయ్యనాయుడు


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సర్వేలపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. నిన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన ఢిల్లీ ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎగ్జిట్ పోల్స్ కాదు... రేపు వెలువడనున్న ఎగ్జాక్ట్ ఫలితాలు చూడండి. అవి మాకే అనుకూలం’’ అని ఆయన చెప్పారు. ‘‘నిన్న వెలువడినవి ఎగ్జిట్ పోల్ (ఊహాజనిత) ఫలితాలు మాత్రమే. 10న ఎగ్జాక్ట్ (వాస్తవ) ఫలితాలొస్తున్నాయి. వాటిలో మేమే గెలుస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్ పేరుతో తమపై వ్యతిరేక ప్రచారం జరిగిందన్న ఆయన, ఆ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుకు ప్రామాణికం కావన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News