: 'షీ' టీంల దెబ్బకు 85 శాతం తగ్గిన ఈవ్ టీజింగ్ కేసులు
ఇటీవల పోలీసుశాఖ ప్రారంభించిన 'షీ టీం' పథకం విజయవంతం అయింది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 'షీ' టీమ్స్ వచ్చిన తరువాత ఈవ్ టీజింగ్ కేసులు 85 శాతం తగ్గిపోయాయి. గడచిన మూడు నెలల్లో 550 మంది అకతాయిలను వీడియో ఆధారాలతో 'షీ' టీంలు పట్టేశాయి. దీంతో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ లు, ప్రధాన కూడళ్ళలో యువతులను వేధించేందుకు ఆకతాయిలు జంకుతున్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ మిగతా జిల్లాల్లోనూ 'షీ' టీంలు ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.