: నేటితో ముగియనున్న కేసీఆర్ ఢిల్లీ టూర్... వెంకయ్య, రాజ్ నాథ్ లతో నేడు భేటీ
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో జరుపుతున్న సుదీర్ఘ పర్యటన నేటితో ముగియనుంది. ఈ నెల 5న ఢిల్లీ వెళ్లిన ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 'నీతి ఆయోగ్' తొలి సమావేశానికి హాజరయ్యారు. ప్రధానితోనూ కేసీఆర్ భేటీ అవుతారని ముందుగా అనుకున్నా, అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికే ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ నేడు తన పర్యటనను ముగించుకుని హైదరాబాద్ బయలుదేరనున్నారు. నేడు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్ నాథ్ సింగ్ లతో కేసీఆర్ భేటీ కానున్నారు.