: స్విట్జర్లాండ్... మన నల్లధనానికే కాదు, భారత్ ‘అక్రమ’ ఔషధాలకూ కేంద్రమేనట!


స్విట్జర్లాండ్ పేరు వింటేనే మనకు స్విస్ బ్యాంకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే, మన నేతాశ్రీలు, బడా పారిశ్రామికవేత్తలు తమ అక్రమ సంపాదనను అక్కడే దాచుకున్నారు కాబట్టి. తాజాగా స్విట్జర్లాండ్ మెడికల్ షాపుల్లోనూ మన దేశం మందులు విరివిగా కనిపిస్తున్నాయట. సక్రమ మార్గాల్లో అక్కడి మెడికల్ షాపులకు మన మందులు చేరితే గర్వించదగ్గదే. అయితే, అక్కడ కనిపిస్తున్న మన మందులన్నీ అక్రమ మార్గాల్లో తరలిపోయినవేనట. వివిధ దేశాల నుంచి అక్రమ మార్గాల్లో ఆ దేశానికి వెల్లువెత్తుతున్న మందుల్లో మన దేశానికి చెందిన మందులే 45 శాతం ఉంటున్నాయని స్విట్జర్లాండ్ ఔషధ నియంత్రణ మండలి ‘స్విస్ మెడిక్’ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మన మందులు అక్కడికి తరలుతున్న విషయంపై మన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని 'స్విస్ మెడిక్' ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News