: మాంఝీకి మద్దతివ్వకపోతే లేపేస్తాం!: బీహార్ మంత్రి బెదిరింపులు


బీహార్ జేడీ(యు)లో నెలకొన్న సంక్షోభం గంటలు గడిచేకొద్దీ మరింతగా ముదురుతోంది. తాజాగా మాంఝీ క్యాబినెట్ లోని మంత్రి వినయ్ బిహారి, ఎమ్మెల్యే సుమిత్ సింగ్ లపై క్రిమినల్ కేసు నమోదైంది. మాంఝీకి మద్దతివ్వకుంటే తనను చంపేస్తామని వీరు బెదిరించినట్టు మాజీ మంత్రి బిమా భారతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాంఝీ కోటరీలో ముఖ్య సలహాదారుగా, ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న నరేంద్ర సింగ్ కుమారుడే సుమిత్ సింగ్ అని తెలుస్తోంది. నిన్న మాంఝీ బర్తరఫ్ చేసిన మంత్రులలో భారతి కూడా ఉన్నారు. అయితే ఈ ఆరోపణలను వినయ్ బిహారి కొట్టిపడేశారు.

  • Loading...

More Telugu News