: సూర్యాపేట వద్ద భారీగా నిలిచిన ట్రాఫిక్... ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమైన లింగమంతుల జాతర
నల్గొండ జిల్లాలో దురాజ్‌పల్లి లింగమంతుల జాతర ఈ ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఇప్పటికే జాతర స్థలానికి చేరుకున్న వేలాది మంది భక్తులు ఆనందోత్సాహాల మధ్య స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. మధ్యాహ్నానికి జాతరకు లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాగా, నార్కట్ పల్లి నుంచి కోదాడ వరకూ సాధారణ ట్రాఫిక్ నిలిపినప్పటికీ, సూర్యాపేట వద్ద జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దురాజ్‌పల్లి నుంచి సూర్యాపేట వైపు కిలోమీటరు మేర వాహనాలు ఆగిపోయినట్టు సమాచారం. విజయవాడ వెళ్ళే బస్సులు, ఇతర వాహనాలను నల్గొండ, మిర్యాలగూడ మీదుగా మళ్లించిన సంగతి తెలిసిందే.