: ఏపీ ‘పీఆర్సీ’ ఏమయ్యేనో?... 43 శాతం ఫిట్ మెంట్ పై సర్కారు, ఉద్యోగుల మధ్య కోల్డ్ వార్!


వేతన సవరణ అమలుతో తెలంగాణ ఉద్యోగులు సంబరాల్లో మునిగిపోయారు. రికార్డు స్థాయిలో 43 శాతం ఫిట్ మెంట్ ను ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఉద్యోగులను సంతోషంలో ముంచేశారు. కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయం పొరుగు రాష్ట్రం ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి తెర తీసిందనే చెప్పాలి. తమకు కూడా తెలంగాణ ఉద్యోగుల మాదిరిగా 43 శాతం ఫిట్ మెంట్ ను ప్రకటించాల్సిందేనని, అందులో అరశాతం తగ్గినా సహించేది లేదని ఇప్పటికే ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు ప్రకటించారు. అయితే లోటు బడ్జెట్ తో సతమతమవుతున్న రాష్ట్రం, 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వలేదన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తించి, సహకరించాలని ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే, పీఆర్సీపై నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ సబ్ కమిటీ నేడు భేటీ కానుంది. భేటీలో సబ్ కమిటీ నిర్ణయించిన ఫిట్ మెంట్ ను ఆ మరుక్షణమే సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రకటిస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే 43 శాతం కంటే ఏమాత్రం తగ్గినా ఆందోళన బాట పట్టక తప్పదని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఏపీఎన్జీఓలు కూడా నేడు భేటీ అవుతున్నారు. దీంతో నేటి రెండు భేటీలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News