: కేజ్రీవాల్ ఫెవికాల్ డబ్బా కొనుక్కున్నారు: నవ్వులు పూయించిన ఆప్ నేత
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడకముందు ఎగ్జిట్ పోల్స్ లో అనుకూల ఫలితాలు రావడంతో ఆప్ నేతలు ఉత్సాహంలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ మీడియా సమావేశంలో నవ్వులు పువ్వులు పూయించారు. అరవింద్ కేజ్రీవాల్ గతంలోలా పదవిని వదిలిపెట్టడం ఉండదని అన్నారు. అందుకోసం ఆయన ఫెవికాల్ డబ్బా కొనుక్కున్నారని అన్నారు. దీంతో సమావేశ భవనంలో నవ్వులు విరిశాయి. విజయంపై నమ్మకం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారీ ఆధిక్యం వస్తే అది బీజేపీ చలవేని ఆయన పేర్కొన్నారు. బీజేపీలోని అంతర్గత విభేదాలు తమకు కలిసి వచ్చాయని ఆయన తెలిపారు. అందుకు బీజేపీ నేతలకు పుష్పగుచ్ఛాలు ఇవ్వాలని ఆయన సూచించారు.