: కేసీఆర్ 8 నెలల్లో 200 పథకాలు ప్రకటించారు: కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన ఎనిమిది నెలల్లో 200 పథకాలు ప్రకటించారని ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్ కు తప్ప మరే పార్టీకి మనుగడ లేదని అన్నారు. హైదరాబాదులోని అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని ఆమె తెలిపారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. బోధన్ లోని షుగర్ కర్మాగారాన్ని ప్రభుత్వ పరం చేస్తామని ఆమె వెల్లడించారు.