: కేంద్ర పథకాలు కొనసాగించాలి...నిధులు తగ్గించొద్దు: అరుణ్ జైట్లీ


కేంద్రం చేపట్టిన 66 పథకాలను కొనసాగించాలని ముఖ్యమంత్రులు కోరారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నాలుగు గంటలకు పైగా కొనసాగిన నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, నీతి ఆయోగ్ పై ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారని అన్నారు. 2015 బడ్జెట్ పై నీతి ఆయోగ్ చర్చించిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు కొనసాగుతున్న 66 కేంద్ర పథకాలను కొనసాగనివ్వాలని ముఖ్యమంత్రులు స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు. దేనికీ నిధులు తగ్గించకూడదని వారు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రాల సహకారంతోనే స్వచ్ఛభారత్, జన్ ధన్ యోజన విజయవంతం కావాలని ప్రధాని తెలిపినట్టు ఆయన వివరించారు. స్వచ్ఛభారత్, నైపుణ్యాల అభివృద్ధిపై ఉపసంఘాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. అభివృద్ధి, సమర్ధత, పెట్టుబడులను కేంద్రం ప్రాధామ్యంగా తీసుకుంటుందని జైట్లీ చెప్పారు. పేదరిక నిర్మూలన ప్రాజక్టుల పనితీరుపైనా, వ్యవసాయ రంగంపైనా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించినట్టు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News