: చెన్నైలో బీసీసీఐ వార్షిక సభ్య సమావేశం


మార్చి 2న చెన్నైలో బీసీసీఐ వార్షిక సభ్య సమావేశం జరగనుంది. ఈ మేరకు బీసీసీఐ వర్కింగ్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ చీఫ్, బీసీసీఐ అధ్యక్షుడిగా ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని శ్రీనివాసన్ కు సూచించిన సుప్రీంకోర్టు, అవినీతిని ఉపేక్షించకూడదని, నిబంధనల ప్రకారం నడచుకోవాలని బీసీసీఐకి స్పష్టం చేసింది. దీంతో బీసీసీఐ అధ్యక్షపదవికి ఎన్నికలు నిర్వహించాలని పరోక్షంగా సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయపరమైన సలహా కోసం బీసీసీఐ వర్కింగ్ కమిటీ మార్చి 2న సమావేశం కావాలని నిర్ణయించింది. ఆరోజు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News