: రెండు రోజులు సినిమాలు చూడండి, ధ్యానం చేయండి, విశ్రాంతి తీసుకోండి: కేజ్రీవాల్
'రెండు రోజులు హాయిగా విశ్రాంతి తీసుకోండి' అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అనుచరులకు పిలుపునిచ్చారు. హస్తిన అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులతో గడపాలని సూచించారు. సినిమాలు చూడండి, ధ్యానం చేయండి అంటూ దిశానిర్దేశం చేశారు. 'దేవుడు మిమ్మల్ని అనుగ్రహించా'లని కేజ్రీ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కార్యకర్తలు అద్భుతంగా పని చేశారని కేజ్రీవాల్ కితాబునిచ్చారు. కాగా, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కేజ్రీవాల్ వైపే మొగ్గుచూపుతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.