: రోహిత్ శర్మ ఔట్... ప్రారంభంలోనే టీమిండియా తొలి వికెట్ డౌన్
ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ లో భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ విఫలమయ్యాడు. 14 బంతులు ఎదుర్కొన్న రోహిత్ కేవలం 8 పరుగులు చేసి హాజిల్ వుడ్ బౌలింగ్ లో ఆరోన్ ఫించ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిగిరాడు. దీంతో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కు టీమిండియా వైఎస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జతకలిశాడు. 4.3 ఓవర్లకే తొలి వికెట్ పడటంతో టీమిండియాలో కలవరం మొదలైంది. ఆరు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది.