: కేబీఆర్ పార్కులో అగ్ని ప్రమాదం... పరుగులు పెట్టిన వాకర్లు
హైదరాబాదులోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు (కేబీఆర్ పార్కు) మరోమారు వార్తల్లోకెక్కింది. ఇటీవలే పార్కులో వాకింగ్ కు వచ్చిన అరబిందో ఫార్మా అధినేత నిత్యానందరెడ్డిపై జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా నేటి ఉదయం పార్కులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో పార్కులోని చెట్లు దగ్ధమయ్యాయి. ప్రముఖులు వాకింగ్ కు వస్తున్న పార్కులో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. అగ్ని ప్రమాదం నేపథ్యంలో మార్నింగ్ వాక్ కు వచ్చిన ప్రముఖులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విద్యుదాఘాతానికి గల కారణాలు తెలియరాలేదు.