: బద్రి మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి... సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు
టీవీ9 న్యూస్ రీడర్ బద్రి మృతిపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేటి ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం లక్ష్మీనగర్ వద్ద జరగిన రోడ్డు ప్రమాదంలో బద్రి దుర్మరణం పాలయ్యారు. బద్రి కుటుంబం ప్రయాణిస్తున్న కారు టైరు పేలిన కారణంగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. బద్రి మరణ వార్త తెలియగానే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు, బద్రి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బద్రి మరణం పట్ల ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కూడా సంతాపం ప్రకటించారు.