: పేరూరును చుట్టుముట్టిన 30 ఏనుగులు... భయాందోళనల్లో గ్రామస్తులు
చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న గ్రామాలను గజరాజుల భయం వీడటం లేదు. నిత్యం జనావాసాల్లోకి వస్తున్న ఏనుగులతో పంటలకు నష్టం జరగడమే కాక, జనం క్షణమొక యుగంలా కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం పేరూరును నేటి ఉదయం 30 ఏనుగులు చుట్టుముట్టాయి. మూడు గ్రూపులుగా వచ్చిన ఏనుగులు గ్రామ పరిసరాల్లోని పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఒకేసారి 30 దాకా ఏనుగులు రావడంతో తీవ్ర భయాందోళనలకు గురైన గ్రామస్తులు, పెద్ద ఎత్తున మంటలను రాజేసి ఏనుగులను తరిమికొట్టేందుకు యత్నిస్తున్నారు.