: బయల్పడ్డ ధ్యాన ముద్రలో ఉన్న మమ్మి... ఇంకా జీవం ఉందని భావిస్తున్న స్థానికులు


ధ్యాన ముద్రలో ఉన్న ఓ మమ్మి మంగోలియాలో బయల్పడింది. ఇది 200 ఏళ్ల క్రితం నాటిదని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ధ్యానం చేస్తూ, నిర్యాణం చెందిన ఓ బౌద్ధ గురువుకు చెందినదని భావిస్తున్నారు. అయితే, ఈ మమ్మిలో ఇంకా జీవం ఉందని స్థానికులు భావిస్తుండటం విశేషం. రాజధాని ఉలన్ బటోర్ ప్రాంతంలోని గుహలో ఓ స్థానికుడు ఈ మమ్మిని కనుగొని, ఇంటికి తీసుకెళ్లాడు. కాళ్లు, చేతులు ముడుచుకుని, పద్మాసనం వేసుకుని, ధ్యానం చేస్తున్నట్టుగా ఈ మమ్మి ఉంది. పోలీసులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ పరిశోధనల కోసం ఉలన్ బటోర్ లోని పరిశోధనశాలకు పంపారు.

  • Loading...

More Telugu News