: ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతాయి... ఢిల్లీ పీఠం బీజేపీదే: కిరణ్ బేడీ


ఢిల్లీ శాసనసభకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆప్ అధినేత కేజ్రీవాలే కాబోయే ముఖ్యమంత్రి అంటూ తేల్చి చెప్పేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ పై బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతాయని, అంచనా వేసిన సంఖ్యల్లో మార్పు వస్తుందని అన్నారు. హస్తిన పీఠం బీజేపీదే అన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. 3 గంటల వరకు జరిగిన పోలింగ్ ఆధారంగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయని... 3 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ శాతం భారీగా పెరిగిందని... ఈ సమయంలో జరిగిన పోలింగ్ గెలుపోటముల అంచనాలను తలకిందులు చేస్తుందని చెప్పారు. ఫలితం ఏదైనా, బాధ్యత మాత్రం తనదే అని తెలిపారు. ఎన్నికల ఫలితాల కోసం 10వ తేదీ వరకు వేచి చూస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News