: ఓటమిపాలైన విశ్వనాథన్ ఆనంద్
భారత చెస్ దిగ్గజం, మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తన అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. జర్మనీలో జరుగుతున్న గ్రిన్కె చెస్ క్లాసిక్ టోర్నీలో మాగ్నస్ కార్ల్ సన్ చేతిలో ఆనంద్ పరాజయం పాలయ్యాడు. టోర్నమెంట్ నాలుగో రౌండ్ లో తెల్లపావులతో ఆటను ప్రారంభించిన ఆనంద్ ఈ ఓటమితో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నాడు. ఈ ఓటమితో ఆనంద్ ఆరో స్థానానికి పడిపోయాడు. ఎనిమిది మంది ఆటగాళ్లు తలపడుతున్న ఈ టోర్నీలో... ప్రస్తుతం ఆనంద్ 1.5 పాయింట్లు సాధించాడు.