: మరో ఆఫర్ ప్రకటించిన స్పైస్ జెట్


విమానయాన రంగంలో స్పైస్ జెట్ సంస్థ వరుస ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షిస్తోంది. మొన్నటికి మొన్న ప్రేమికుల దినోత్సవం కానుకగా రూ. 1499కే టిక్కెట్ ధర ప్రకటించింది. తాజాగా రూ.1899కే టిక్కెట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ధర నుంచే ప్రయాణ టిక్కెట్ ప్రారంభమవుతుందని తెలిపింది. రెండు రోజుల పాటు ప్రయాణికులు ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ నెల 28 లోగా ఈ టిక్కెట్ తో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించగా, వీటిని స్పైస్ జెట్ విమానాలు తిరిగే మార్గాల్లో మాత్రమే వినియోగించుకోవాలని వెల్లడించింది.

  • Loading...

More Telugu News