: కాంట్రాక్ట్ మ్యారేజ్ సంస్థ నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా బ్రోకర్ల అరెస్ట్
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న ఫలక్ నుమాలో ఓ కాంట్రాక్ట్ మ్యారేజ్ సంస్థ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సంస్థను నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా బ్రోకర్లతో పాటు, సోమాలియా దేశానికి చెందిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఓ యువతిని సోమాలియా యువకుడు పెళ్లి చేసుకోబోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. 15 రోజుల పాటు అమ్మాయితో గడిపేందుకు రూ. 80 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. సరైన సమయంలో మతపెద్ద సమాచారం ఇవ్వడంతో, పోలీసులు వీరిని కటకటాల వెనక్కి తోశారు. నిందితుల నుంచి 2 పాస్ పోర్టులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.