: ఆ కీచకులు ఉత్తరప్రదేశ్‌ వారు... సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ కు మెయిల్స్‌ వెల్లువ


ఈ కీచకులు ఎవరో కనిపెట్టాలని సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌ చేసిన విజ్ఞప్తికి అమోఘమైన స్పందన వచ్చింది. ఓ బాలికను ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసి ఆ దృశ్యాలను యూట్యూబ్‌ లో పోస్టు చేయగా, వారి చిత్రాలను ఫేస్‌ బుక్‌ లో పెట్టిన సునీతా కృష్ణన్‌, వీరిని గుర్తించాలని కోరుతూ ప్రారంభించిన 'షేమ్‌ ది రేపిస్ట్‌' ప్రచారానికి మద్దతు పెరుగుతోంది. నిందితులను గుర్తిస్తూ పలువురు తనకు మెయిల్స్‌ పంపినట్టు సునీత తెలిపారు. వీరు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారని వివరించారు. దీంతో, అత్యాచార ఘటన యూపీలో జరిగినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు కేసును అక్కడికి బదిలీచేశారు. నిందితుల వివరాలతో తెలంగాణ హోంమంత్రిని కలవనున్నట్టు సునీత తెలిపారు.

  • Loading...

More Telugu News