: దిగుమతి చేసుకున్న ఆయుధాలు ఒక్కోసారి అవసరాలు తీర్చలేవు: పారికర్
కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దిగుమతి చేసుకున్న ఆయుధాలు ఒక్కోసారి మన అవసరాలను తీర్చలేవని తెలిపారు. మన యుద్ధరంగం ఇతర దేశాలకంటే భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. దేశ రక్షణ అవసరాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. అంతకుముందు, ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.