: రోశయ్య పాదాల చెంత గాంధీ ఫొటో... ఆహ్వాన పత్రికలో అపచారం!
మహాత్ముడిని జాతిపితలా భావిస్తున్న దేశం మనది. అలాంటిది, చిలకలూరిపేటలో గాంధీ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆహ్వాన పత్రికలో అపచారం చోటుచేసుకుందని స్థానిక నేతలు అంటున్నారు. ఆ పత్రికలో తమిళనాడు గవర్నర్ రోశయ్య పాదాల వద్ద గాంధీ ఫొటో ప్రచురించారు. ఈ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా రోశయ్య హాజరుకావాల్సి ఉంది. పత్రికలో గాంధీ ఫొటోపై స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంటలిజెన్స్ వర్గాలు రోశయ్య కార్యాలయానికి నివేదించాయి. దీంతో, రోశయ్య ఈ కార్యక్రమానికి హాజరుకాబోవడంలేదని తెలిపారట.