: బంగ్లాదేశ్ లో బస్సుపై పెట్రోల్ బాంబుతో దాడి... నలుగురు మృతి
ప్రయాణికులతో వెళుతున్న బస్సుపై కొందరు దుండగులు పెట్రోల్ బాంబు విసిరిన ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన బంగ్లాదేశ్ లోని గాయ్ బంధా జిల్లాలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి పెట్రోల్ బాంబుతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో నలుగురు అక్కడిక్కడే సజీవదహనం అయ్యారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 11 మందిని రంగపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి, మరికొందరిని గాయ్ బంధా సదర్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ప్రయాణికులతో పాటు కొందరు పోలీసులు గాయపడ్డారని, తీవ్ర గాయాలు అయిన వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని తెలిపారు.