: రేపటి నుంచి వరల్డ్ కప్ వార్మప్ పోటీలు... ఆసీస్ తో భారత్ 'ప్రాక్టీస్'
వన్డే వరల్డ్ కప్ కోసం ఆయా జట్లు సన్నద్ధమయ్యేందుకు ఉద్దేశించిన వార్మప్ మ్యాచ్ లు రేపటి నుంచి జరగనున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ పోటీలు ఫిబ్రవరి 14న ఆరంభమవుతాయి. ఈ నేపథ్యంలో, రేపటి నుంచి వార్మప్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ ప్రాక్టీసు మ్యాచ్ లు ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. రేపు (ఆదివారం) భారత్-ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా-శ్రీలంక, న్యూజిలాండ్-జింబాబ్వే జట్ల మధ్య సన్నాహక మ్యాచ్ లు జరుగుతాయి. అడిలైడ్ లో భారత్, ఆసీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు టిక్కెట్లు అయిపోయామని ఐసీసీ తన వెబ్ సైట్లో పేర్కొంది.