: బెజవాడలో బీభత్సం సృష్టించిన లారీ... ఇద్దరి మృతి


విజయవాడలో ఓ లారీ అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. భవానీపురం రావిచెట్టు సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారి మీదకు లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడినట్టు తెలిసింది. ఇటీవల రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడంలేదు. డ్రైవర్ల బాధ్యతారాహిత్యం, ఫిట్ నెస్ లేని వాహనాలను అడ్డుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం.... ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి.

  • Loading...

More Telugu News