: స్క్రిప్టు చూడగానే నచ్చేసింది...ఛాలెంజింగ్ పాత్ర: సన్నీలియోన్


బాబీఖాన్ దర్శకత్వంలో రానున్న 'ఏక్ పహేలీ లీలా' సినిమాలో శృంగారతార సన్నీలియోన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ పాత్రలో చాలా షేడ్స్ ఉండడానికి తోడు డబుల్ రోల్ చేస్తోంది. తన పాత్ర కోసం చాలా కష్టపడుతోంది. లీలా పాత్ర పోషించడం, ఆ పాత్రలో పరకాయప్రవేశం చేయడం కష్టం అవుతోందని సన్నీలియోన్ తెలిపింది. సినిమా ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, లీలా పాత్ర చాలా ఛాలెంజింగ్ గా ఉందని, స్క్రిప్టు చూడగానే నచ్చేసిందని తెలిపింది. అయితే షూటింగ్ లో లీలాగా మారడానికి కనీసం 2-3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. షూటింగ్ ప్రారంభించిన తొలిరోజు తన లుక్ పూర్తిగా నిర్ణయించుకోవడానికి 6 గంటల సమయం పట్టిందని తెలిపింది. ఈ సినిమా నటీనటుల నుంచి తనకు కావాల్సినంత మద్దతు లభించిందని సన్నీ చెప్పింది. లీలా పాత్రకు డైలాగులు చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డానని సన్నీ వెల్లడించింది. సన్నీతో పాటు ఈ సినిమాలో జయ్ భానుశాలి, రజనీష్ దుగ్గల్, రాహుల్ దేవ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది. కాగా, ట్రైలర్ చూసిన అభిమానులు సన్నీ అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది?... ఎలా చేసినా చూస్తాము కదా, అంటూ సోషల్ మీడియాలో తమవైన శైలిలో జోకులు పేలుస్తున్నారు.

  • Loading...

More Telugu News