: విద్యుత్ ఛార్జీల పెంపు భారం సామాన్యులపై పడదు: లోకేష్
ఆంధ్రప్రదేశ్ లో ఆరు శాతం మేర విద్యుత్ చార్జీలు పెరగనున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని టీడీపీ యువనేత నారా లోకేష్ సమర్థించుకున్నారు. సామాన్యులు, పేదలపై భారం పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరంతర విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. వైకాపా అధినేత జగన్ దీక్షల పేరుతో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.