: నదులన్నీ అనుసంధానం చేస్తే కరవు ఉండదు: సీఎం చంద్రబాబు


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని నదులన్నీ అనుసంధానం చేస్తే కరవు ఉండదని తెలిపారు. గోదావరి నది నుంచి సముద్రంలో కలిసే నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తామని చెప్పారు. నీరు-చెట్టు కార్యక్రమం గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనదని అన్నారు. నీటి సాయంతో పంటలు పండుతాయని, పర్యావరణం కాపాడుకోవచ్చని అన్నారు. వర్షాలను భూగర్భ జలాలుగా మార్చుకోవాలని సూచించారు. చెరువుల్లో పూడిక తీత చర్యలు చేపట్టాలని, తద్వారా చెరువుల్లో భారీగా నీరు చేరుతుందని వివరించారు. పూడిక తీసిన మట్టి సారవంతమైనదని, దాన్ని పొలాల్లో వినియోగించుకోవచ్చని తెలిపారు. ఎక్కడిక్కడ అదనంగా చెక్ డ్యాంలు నిర్మించుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News