: నేడూ నష్టాలతోనే ముగిసిన స్టాక్ మార్కెట్
అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉండడంతో భారత స్టాక్ మార్కెట్ మరో సెషన్లో నష్టాలను నమోదు చేసింది. నేటి ఉదయం స్వల్ప లాభాల్లో నిలిచిన సూచీలు ఆ తరువాత ఒడిదుడుకుల మధ్య నష్టాల్లోకి జారాయి. దీంతో వరుసగా ఆరవ రోజు మార్కెట్ పడిపోయినట్లయింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 133.06 పాయింట్లు పడిపోయి 0.46 శాతం నష్టంతో 28,717.91 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 50.65 పాయింట్లు పడిపోయి 0.58 శాతం నష్టంతో 8,661.05 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. కెయిర్న్ ఇండియా, హెచ్ డీఎఫ్ సీ, ఎన్ఎండీసీ, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు లాభాలను, డీఎల్ఎఫ్, టాటా మోటార్స్, బీహెచ్ఈఎల్, జిందాల్ స్టీల్, టాటా స్టీల్ తదితర కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి.