: కోడలి ప్రసంశల దగ్గరే నట దిగ్గజం మనసు ఆగిపోయిందట!
కోడలు ఐశ్వర్య ప్రశంసల దగ్గరే తన మనస్సు ఆగిపోయిందని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తెలిపారు. అమితాబ్ తన తాజా సినిమా 'షమితాబ్'ను ముంబైలో సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. ఈ సినిమాలో అమితాబ్ నటనకు ఆయన కోడలు ఐశ్వర్య ముగ్ధురాలై తన మామగారిని హత్తుకుని మరీ ప్రశంసల వర్షం కురిపించింది. ఆమె పొగడ్తలకు ఉబ్బితబ్బిబ్బైన అమితాబ్, ఆమె ప్రశంసల దగ్గరే తన మనసు ఉండిపోయిందని తన బ్లాగ్ లో ఫొటో సహా పోస్టు చేశారు. అమితాబ్ ముఖ్యపాత్రలో నటించిన 'షమితాబ్' సినిమాలో తమిళ జంట ధనుష్, అక్షరహాసన్ నటించారు. ఈ సినిమా ఈ రోజే దేశవ్యాప్తంగా విడుదలైంది.