: 'అప్పా' పేరు మార్చిన తెలంగాణ సర్కారు
ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (అప్పా) పేరును రాజా బహదూర్ వెంకటరాంరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీగా మారుస్తూ తెలంగాణ సర్కారు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. స్వాతంత్ర్యానికి పూర్వం తెలంగాణలో నిజాం పాలన సాగుతున్న సమయంలో ఆయన కొత్వాల్ గా విధులు నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలోనే హైదరాబాదులో రెడ్డి హాస్టల్, రెడ్డి కాలేజ్ ఏర్పడ్డాయి. తెలంగాణలో తొలి బాలికల పాఠశాలను నెలకొల్పిన ఘనత కూడా ఆయనదే. నిజాం రాష్ట్రంలో నెలకొల్పిన చాలా విద్యాసంస్థల్లో రాంరెడ్డి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. తన సంపాదనను మొత్తం విద్యాసంస్థల ఏర్పాటు, దానధర్మాలకు కేటాయించిన వెంకటరాంరెడ్డి 1953లో మరణించారు.