: కె.విశ్వనాథ్‌కు 'గామా' జీవిత సాఫల్య పురస్కారం


ప్రముఖ దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్‌ను దుబాయ్‌లో జరుగనున్న 'గామా' అవార్డుల కార్యక్రమంలో భాగంగా జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ తారల నడుమ ఆయనకు సత్కారం జరగనుంది. విశ్వనాథ్ దాదాపు యాభై సంవత్సరాల నుంచి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ, ఆణిముత్యాల్లాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. గామా అవార్డుల కార్యక్రమానికి టాలీవుడ్‌కు చెందిన నటులు అల్లరి నరేష్, బ్రహ్మానందం, శర్వానంద్, బ్రహ్మాజీ, అలీ, బుల్లి తెర నటీమణులు సుమ, అనసూయ తదితరులతోపాటు ప్రముఖ గాయనీగాయకులు హాజరుకానున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News