: ఆ స్థలం మాదే... ఖాళీ చేయండి: తిరుపతివాసులకు టీటీడీ షాక్!
ఉప ఎన్నికల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుపతివాసులకు షాకిచ్చింది. నగరంలోని రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, దొడ్డాపురం కాలనీ, కోటకొమ్మల లేఅవుట్ లోని 9.35 ఎకరాల స్థలం తమదేనని ప్రకటించింది. తమ స్థలాన్ని తక్షణమే ఖాళీ చేయాలని టీటీడీ 1130 మందికి నోటీసులు జారీ చేేసింది. పది రోజుల్లోగా సదరు స్థలాన్ని ఖాళీ చేయాలని టీటీడీ నోటీసుల్లో పేర్కొంది. సరిగ్గా ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై తిరుపతివాసులు భగ్గుమంటున్నారు. 2003లోనూ టీటీడీ ఇదే తరహాలో నోటీసులు జారీ చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.