: ఎంసెట్ పై తొందరొద్దు... న్యాయం మనవైపే ఉంది!: అధికారులతో చంద్రబాబు
రాష్ట్ర విభజన చట్టం పదో షెడ్యూల్ ప్రకారం పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాలుండాలని, అది కూడా ఏపీ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలోనే జరగాలని స్పష్టంగా ఉన్నందున ఎంసెట్ ను తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా నిర్వహించడంపై దృష్టి పెట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి ఎంసెట్‌కు సంబంధించి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, చట్టానికి భిన్నంగా ఎవరూ నడవడానికి వీల్లేదని, ఈ విషయంలో తొందరపాటు వద్దని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ... ఏపీ ఉన్నత విద్యామండలి ఖాతాలను స్తంభింపచేయడం చట్టవిరుద్ధమని, ఈ విషయంలో న్యాయం మనవైపే ఉందని బాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కోర్టు ఇచ్చే తీర్పు వచ్చాక, ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవచ్చని, అప్పటివరకు ఎంసెట్ విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.