: పాకిస్థాన్ లో విడుదలకు ముస్తాబవుతున్న 'షోలే'
భారత్ లో 'షోలే' చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమితాబ్, ధర్మేంద్ర, హేమమాలిని, అంజాద్ ఖాన్ తదితరులు నటించిన ఈ బ్లాక్ బస్టర్ అప్పట్లో ఎన్నో రికార్డులు నమోదు చేసింది. 1975లో విడుదలైన 'షోలే' చిత్రంలోని కొన్ని డైలాగులు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కాగా, సినిమాను పాకిస్థాన్ లోనూ విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. పాక్ లో అగ్రశ్రేణి డిస్ట్రిబ్యూటర్ అయిన నదీమ్ మండ్వీవాలా 'షోలే'ను పాక్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ లో ఈ సినిమా ఇంతవరకు రిలీజ్ కాలేదని తెలిపారు. మార్చి 23న విడుదల చేయాలని మండ్వీవాలా యోచిస్తున్నాడు.