: అప్పులపై బతికే జీవితం వద్దు... కొంత కఠినంగానే బడ్జెట్: అరుణ్ జైట్లీ సంకేతాలు


ఈనెల 28న పార్లమెంట్ ముందుకు రానున్న బడ్జెట్ లో ఖర్చుల తగ్గింపు దిశగా కొన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. అప్పులు తెచ్చుకొని వాటి మీద బతికాలని కోరుకోవడం లేదని ఆయన అన్నారు. పారిశ్రామిక వేత్తలతో నేటి ఉదయం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన ఆయన "ఇప్పటి మన ఖర్చులు, తదుపరి తరానికి అప్పులుగా మిగలరాదు. ఆదాయాన్ని బట్టే ఖర్చులు ఉండాలి" అని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలలు ఉండగానే, ద్రవ్యలోటు ఇప్పటికే లక్ష్యాన్ని మించి పెరిగిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చకు దారితీసాయి. ప్రణాళికేతర వ్యయాన్ని కనీసం 10 శాతం తగ్గించాలని 2014 అక్టోబర్లో ఆదేశాలు జారీచేసినా, ఫలితం మాత్రం కనిపించలేదు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతుండటం, ముడిచమురు ధరల పతనం వంటి అంశాలతో ఆదాయం తగ్గిన నేపథ్యంలో ప్రజలపై భారం పడేలా కొన్ని నిర్ణయాలు బడ్జెట్లో ప్రతిపాదించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News