: షారుఖ్ కు నోటీసులు పంపనున్న అధికారులు... బీజేపీ ఎంపీ ఫిర్యాదు ఫలితం


బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ముంబయిలో తన నివాసం 'మన్నత్' ఎదుట నిర్మించిన ర్యాంప్ ను తొలగించాలంటూ నోటీసులు పంపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 7 రోజుల్లోగా ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని నోటీసుల్లో కోరే అవకాశాలున్నాయి. షారుఖ్ కు నోటీసులు జారీ చేస్తామని అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సంజయ్ దేశ్ ముఖ్ తెలిపారు. కాగా, ఈ ర్యాంప్ కారణంగా పౌరులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ జనవరి 29న మున్సిపల్ కమిషనర్ సీతారామ్ కుంతేకు లేఖ రాశారు. మరికొందరు స్థానికులు కూడా దీనిపై ఫిర్యాదు చేశారు. కాగా, తన లేఖలో మహాజన్ నేరుగా షారుఖ్ పేరును ప్రస్తావించకుండా, 'ఓ బంగ్లా యజమాని' అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News