: 50 లక్షలకు చేరిన సచిన్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య


క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ను ట్విట్టర్లో అనుసరిస్తున్న వారి సంఖ్య 50 లక్షలకు చేరింది. ఈ మార్కు చేరుకున్న రెండో భారత క్రికెటర్ సచినే. ఈ విషయంలో యువ బ్యాటింగ్ సంచలనం విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ ట్విట్టర్ ఖాతాను 53 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఇక, సచిన్ తర్వాత ధోనీ (34 లక్షలు), సెహ్వాగ్ (33 లక్షలు), యువరాజ్ సింగ్ (28 లక్షలు) ఉన్నారు. ఆటకు వీడ్కోలు పలికినా సచిన్ కు ప్రజాదరణ తగ్గకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News