: 'ఏఐబీ రోస్ట్' లో కోహ్లీ, అనుష్కలపై జోకులు... సీరియస్ గా తీసుకోబోమన్న బాలీవుడ్ బ్యూటీ
ఇటీవల వివాదాస్పదమైన 'ఏఐబీ రోస్ట్' స్టేజ్ షోలో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతడి ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మలపైనా జోకులు పేల్చారట. అయితే, తాము ఆ కామెడీని సీరియస్ గా తీసుకోవడం లేదని అనుష్క తెలిపింది. అది ఆరోగ్యకరమైన హాస్యమనే తాము భావిస్తున్నట్టు ఈ అందాలభామ పేర్కొంది. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఇతరులు ఈ కార్యక్రమంపై భిన్నమైన అభిప్రాయం కలిగి ఉండొచ్చని, ప్రజాస్వామ్యం ఘనత అదేనని చెప్పుకొచ్చింది. కాగా, ఈ ఏఐబీ రోస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు కరణ్ జోహార్, నటులు రణ్ వీర్ సింగ్, అర్జున్ కపూర్ తదితరులపై అసభ్య ప్రదర్శన ఆరోపణలతో కేసు నమోదైన సంగతి తెలిసిందే.