: తేనెటీగల నుంచి తప్పించుకోబోయి... మృత్యువు ఒడిలోకి!


తన వెంట పడుతున్న తేనెటీగల నుంచి తప్పించుకోవాలని పరిగెడుతున్న ఆ యువకుడికి మృత్యువు మరో రూపంలో వెంటాడుతోందని తెలీదు. తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే యత్నంలో యువకుడు మినీ లారీ కింద పడి మరణించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల సమీపంలో చోటు చేసుకుంది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నారాయణరెడ్డి పల్లెకు చెందిన జయచంద్ర ఈ ఉదయం ఎల్లుట్ల-మడ్డిపల్లి రోడ్డు సమీపంలో ట్రాక్టర్లో రాళ్లు నింపడానికి వెళ్లాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న తేనెతుట్టె కదలగా, ఈగలన్నీ జయచంద్రపై దాడి చేశాయి. పారిపోయేందుకు రోడ్డుపైకి పరిగెత్తగా, వేగంగా వస్తున్న మినీ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News