: అట్లూరి రామారావుకు ప్రముఖుల నివాళి
సినీ రంగానికి చెందిన ప్రముఖులు అట్లూరి రామారావు ఈ ఉదయం పంజాగుట్టలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త సినీ రంగానికి చెందిన వారిని కలచివేసింది. రామోజీ గ్రూపు ఛైర్మన్ రామోజీరావు, ఆయన కుమారుడు (ఈనాడు ఎండీ) కిరణ్ లు అట్లూరి భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళి అర్పించారు. అలాగే సంగీత దర్శకుడు కీరవాణి, సినీ రచయితలు పరుచూరి బ్రదర్స్, తదితరులు ఆయనకు నివాళి అర్పించి, కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. రేపు ఉదయం ఎర్రగడ్డ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.