: గోదావరిలో పూజలతో కాంగ్రెస్ కోటి సంతకాల సేకరణ ప్రారంభం... చిరంజీవి సహా హాజరైన కీలక నేతలు
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. కొద్దిసేపటి క్రితం రాజమండ్రి చేరుకున్న ప్రదేశ్ కాంగ్రెస్ కీలక నేతలు గోదావరి నదిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంతకాల సేకరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కేవీపీ రామచంద్రరావు, పనబాక లక్ష్మి, జేడీ శీలం, కిల్లి కృపారాణి తదితరులు హాజరయ్యారు. ఒకేసారి కాంగ్రెస్ కీలక నేతలంతా రాజమండ్రి చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.