: జర్మనీ, ఫ్రాన్స్, చైనా, రష్యా, శ్రీలంక... మోదీ వరుస పర్యటనలు!


సమీప భవిష్యత్తులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనల షెడ్యూల్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్, చైనా, రష్యాల్లో ఆయన పర్యటనలు సాగనున్నాయి. కాగా, ఏప్రిల్‌ లో తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియస్ తనను ఆహ్వానించినట్టు మోదీ స్వయంగా వెల్లడించారు. ఇక మే 26 నుంచి మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఏటా ఏప్రిల్‌లో నిర్వహించే హనోవర్ పారిశ్రామిక ప్రదర్శనకు హాజరయ్యేలా మోదీ జర్మనీ పర్యటన ఖరారుకానున్నట్లు తెలిసింది. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు జులైలో ఆయన రష్యాకు వెళ్లనున్నారు. వీటితోపాటు శ్రీలంకలోనూ మోదీ పర్యటిస్తారని, 15 నుంచి ప్రారంభమయ్యే లంక అధ్యక్షుడి భారత పర్యటన ముగిసిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని విదేశీ వ్యవహారాలశాఖ ప్రతినిధులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News