: ఆరోజు నేనే కాదు.. జట్టు మొత్తం ఏడ్చారు: ధోనీ


నాలుగేళ్లనాడు శ్రీలంకపై వరల్డ్ కప్ ఫైనల్లో భారత్‌ గెలిచిన తరువాత ఆ భావోద్వేగంతో ధోనీ ఏడుపును ఆపుకోలేకపోయాడట. కెప్టెన్‌తో పాటు ఆటగాళ్లు, సిబ్బంది అంతా ఏడ్చారట. ఈ విషయాన్ని ధోనీ స్వయంగా తెలిపాడు. ఆనాడు డ్రెస్సింగ్ రూములో నెలకొన్న వాతావరణాన్ని ధోనీ తాజాగా గుర్తుచేసుకున్నాడు. మ్యాచ్ గెలిచాక ఏడుస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని, ఫొటోలు అవీ లేవు కాబట్టి ప్రపంచం జట్టు భావోద్వేగాల్ని, ఆనందభాష్పాలను చూడలేకపోయిందని ధోనీ అన్నాడు. అప్పటి సెమీఫైనల్ పోటీ పాక్‌ తో అయ్యేసరికి తమపై మరింత ఒత్తిడి నెలకొందని అన్నాడు. అన్నం తింటున్నా, అది తిన్న ఫీలింగ్ ఉండేది కాదన్నాడు.

  • Loading...

More Telugu News