: ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానం...పంజాబ్ లో ప్రారంభం
దేశంలో ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసే ప్రక్రియ పంజాబ్ లో ప్రారంభం కానుంది. ఈ మేరకు సమాచారాన్ని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సంబంధిత సాఫ్ట్ వేర్ కూడా విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా పంజాబ్ లో దీనిని చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆయన తెలియజేశారు.